25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • 3.gif

    Oct 26 ,2012 01:45 pm

    allu_arjun_latesteeస్టైలిష్ స్టార్ బన్నీ తెరమీద కనిపించాడంటే ఓ వెరైటీ ఉండాల్సిందే. అందుకే అల్లు అర్జున్ ఆ బిరుదు అందుకున్నాడు. తాజాగా బన్నీ నటిస్తోన్న సినిమాకోసం బ్యాంకాక్, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లి మరీ షాపింగ్ చేసి వస్తున్నారు. ఇందులో కేవలం హీరో బన్నీ బట్టలకే కోటి ఖర్చవుతుందని వినికిడి. ఇటీవల కాలంలో కాస్టూమ్స్ మీద నిర్మాతలు విపరీతంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఎలా లేదన్నా స్టార్ హీరోలకు ప్రతి సినిమాకి 50, 60 లక్షల వరకు కాస్ట్యూమ్స్ కే అయిపోతున్నాయి.
          ప్రస్తుతం అల్లు అర్జున్ నటించే 'ఇద్దరమ్మాయిలతో' సినిమాకైతే ఈ విషయంలో మరి కాస్త ఎక్కువే అవుతోందట. ఏకంగా కోటి రూపాయల బడ్జెట్ ని హీరో కాస్ట్యూమ్స్ కి నిర్మాత బండ్ల గణేష్ కేటాయించినట్టు చెబుతున్నారు. కేరెక్టర్ని బట్టి ఆ సినిమాలో హీరో కాస్త షో పుటప్ చేయాలట. అందుకని కాస్ట్యూమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టవలసి వస్తోందట. సో... ఈ సినిమాలో రకరకాల వెరైటీ కాస్ట్యూమ్స్ లో బన్నీని మనం చూడచ్చన్న మాట! 
          ఇక  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందే సినిమా షూటింగు షురూ అయిపోయాంది. అల్లు అర్జున్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు ప్రారంభిస్తామని నిర్మాతల్లో ఒకరైన కె.వెంకటేశ్వరరావు చెప్పారు. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర కథ సాగుతుందని కథా రచయిత వక్కంతం వంశీ తెలిపారు. కాగా, ఈ చిత్రానికి 'రేసు గుర్రం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers