26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • Mitt Romney.gif

    Oct 23 ,2012 06:58 pm

    Mitt Romney: US Can't Kill Its Way Out Of Extremist Threats

    అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ అభినందనలు తెలిపారు. అయితే, అల్‌ఖైదా సంస్థను పూర్తిగా నాశనం చేయాల్సి ఉందని ఆయన నొక్కివక్కాణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒబామా, రోమ్నీలు ముచ్చటగా మూడోమారు ముఖాముఖి చర్చల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా వారు విదేశాంగ విధానం, సెప్టెంబర్‌ 11 దాడులు, లిబియాలో అమెరికాలో మిషన్‌పై ప్రధానంగా చర్చించారు. ఫ్లోరిడా రాష్ట్రం 'బొకా రాటన్‌' లిన్‌ యూనివర్సిటీలో ఈ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మిట్ రోమ్నీ మాట్లాడుతూ.. ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టినందుకు ఒబామాను ప్రశంసించిన రోమ్ని తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు సమగ్ర వ్యూహం ఉండాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. రోమ్నీ వ్యాఖ్యలపై ఒబామా స్పందిస్తూ.. అమెరికా ప్రజల్ని సురక్షితంగా ఉంచేందుకు నాలుగేళ్లుగా తాను శ్రమపడుతున్నాన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తుది విడత చర్చల్ని కీలకంగా భావిస్తారు. కాగా, నవంబర్‌ ఆరో తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers