
వయసు ముదిరిపోయిన ఇప్పటికి నంది రాని సీనియర్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అతని తరువాత వచ్చిన హీరోలందరికి నంది వరించింది. కానీ ఆయనకు మాత్రం నంది రాకపోవటం పై ఆవేదనతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రపభుత్వం నంది అవార్డులను ప్రవేశపెట్టినప్పటి నుంచి నటులకు ఒక ఆత్మసంతృప్తిని పొందే అవకాశం దొరికింది. నంది అవార్డు పొందితే అదొక ఆనందం! 1964లో మొదలైన నంది అవార్డు ప్రదానంలో ఎంతోమందికి చోటు దక్కింది. దాదాపు స్టార్ హీరోలందరూ నంది అవార్డును సొంతం చేసుకున్నవారే. అయితే నటులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఇద్దరు నటులకు మాత్రం నంది అవార్డు దక్కకపోవడం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే? వారిలో ఒకరు నందమూరి తారకరామారావు, ఇంకొకరు మంచు మోహన్‌బాబు! ఈ ఇద్దరూ వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా అనేక రకాల వేషాలు వేశారు. కానీ ఎప్పుడూ నంది అవార్డుకు నోచుకోలేదు. ఎన్టీయార్, మోహన్‌బాబుల నటకౌశలం గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కానీ, నంది అవార్డును పొందే అవకాశం ఎందుకు రాలేదా? అనేదే విస్మయం కలిగించే విషయం. 50, 60, 70వ దశకాల్లో ఎన్టీయార్ తిరుగులేని హీరో. 80, 90వ దశకాల్లో మోహన్‌బాబు విలన్‌గా, హీరోగా నటవైవిధ్యంతో మంచి పేరు సంపాదించుకుని అనేక పాత్రల్లో ఒదిగిపోయాడు. కానీ ఆయన అసామాన్య ప్రతిభకు సైతం నంది చిక్కకపోవడం ఒకింత ఆశ్చర్యం. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ సమకాలీకుడు అయిన నాగేశ్వరరావు ఐదు నంది అవార్డులు అందుకోవడం! అంతేకాదు మోహన్‌బాబు సహనటులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ కూడా నంది అవార్డులు అందుకున్నారు. కానీ మోహన్ బాబు ఇప్పటి వరకు ఒక్క నంది కూడా రావటంతో ఆయన నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది.
