
దగ్గుబాటి హీరో రానా పై అనేక విమర్శలు వస్తునే ఉన్నాయి. బాలీవుడ్ లో సినిమా చేస్తే అక్కడ రూమర్ పుట్టింది. చేసిన సినిమాలు తక్కవైన రూమర్స్ మాత్రం చాలా పుట్టాయి. ఇప్పుడు టాలీవుడ్ లో త్రిష రానా ల మధ్య హాట్ రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై త్రిష మీడియా పై చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కొన్ని పుకార్లు త్రిషకి కోపం తెప్పిస్తున్నాయట. ముఖ్యంగా రానాతో లింకులు పెట్టి వస్తున్న వార్తలపై ఆమె చాలా సీరియస్ గా స్పందిస్తోందట. ‘రానా నేనూ చిన్నప్పట్నుంచి స్నేహితులం. చెన్నైలో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్లం. అప్పట్లో హాయిగా బయటకి వెళ్లేవాళ్లం. కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేసేవాళ్లం. నాకే సమస్య వచ్చినా అతనితో చెప్పుకునే స్వతంత్రం నాకుంది. కానీ, ఇప్పుడు రానా హీరో అయ్యాక మా స్నేహానికి పెడార్థాలు తీస్తారేంటి? మా స్నేహం ఈనాటిది కాదు’ అని వాపోతోందిట.

