
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచుతోంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమాంతర విచారణ జరుపుతున్న ఈడీ... మొదటి చార్జిషీటుకు సంబంధించి ఒక విడత ఆస్తుల జప్తు పూర్తి చేసింది. మరో రెండు మూడు వారాల్లో... తదుపరి చార్జిషీట్లలోని అభియోగాలతో ముడిపడిన ఆస్తులపైనా జప్తు కొరడా ఝళిపించే అవకాశం కనిపిస్తోంది. 'జగన్ అండ్ కో'కు సంబంధించి రూ.51 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఈనెల 4న జప్తు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం... ఆస్తుల జప్తు జరిగిన నెలలోపు అడ్జుడికేటింగ్ అథారిటీలో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోపే దీనిపై కేసు దాఖలు చేయనున్నట్లు సమాచారం. వెరసి... జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో ఈడీ మరింత వేగం పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మూడు చార్జ్‌షీట్లు, వాటి అనుబంధ పత్రాలు తీసుకున్న ఈడీ అధికారుల చేతికి... వాన్‌పిక్‌పై దాఖలైన నాలుగో చార్జిషీటు ప్రతి కూడా చిక్కనుంది. వాన్‌పిక్ చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలను ఇవ్వాల్సిందిగా ఈడీ చేసుకున్న విన్నపాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు మన్నించింది. వాటిని ఇచ్చేందుకు అంగీకరించింది.

వాన్ పిక్ వ్యవహారం పైనా మనసుపెట్టిన ఈడీ ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీ షీటుతో పాటు ఇతర పత్రాలను కోర్టు అనుమతితో తీసుకుంది. వాటిని పరిశీలించాక జగన్ ను విచారించే అవకాశముంది. దీంతో పాటు వాన్ పిక్ కు సంబందించి రూ. 2 వేల కోట్ల ఆస్తులనూ జప్తు చేసే అవకాశముందని మీడియా వార్తలు వస్తున్నాయి. వాన్ పిక్ ప్రాజెక్టు కోసం భూసేకరణలో భాగంగా రాక్ నుంచి అందిన నిధులు హవాలా మార్గంలో ఇక్కడికి వచ్చాయని సీబీఐ దర్యాప్తులో తేల్చింది. అసలు ఆ ప్రాజెక్టు 12,973 ఎకరాలను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే దాని విలువ సుమారు రూ. 1426 కోట్ల వరకూ ఉంటుందని అంచన వేశారు. ఈ మొత్తం నిమ్మ గడ్డ కు చెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో కొంత భాగం అప్పటి ప్రభుత్వం లో ఉన్న వైఎస్ ద్వారా జగన్ కంపెనీల్లో రూ . 854 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ వెల్లడించింది. అంతేకాకుండా మరో కొన్ని కంపెనీలు వేల కోట్ల రూపాయలు వాన్ పిక్ ప్రాజెక్టులో పెట్టు బడులు పెట్టినట్లు తెలుస్తోంది. రాక్ ఇన్ ఫ్రా హోల్డింగ్స్ నుండి రూ 450 కోట్లు వచ్చాయాని అందులో 150 కోట్ల పరిహారాన్నే నిమ్మగడ్డ చెల్లించారని సీబీఐ వెల్లడించింది. ఇక మిగిలిన రూ 300 కోట్లు కు అంతిమ లబ్ధిదారెవరో తేలాల్సి ఉందని తెలిపింది అంతే కాకుండా జగన్ కంపెనీలైన సిలికాన్, బిల్డర్స్, భారతి సిమెంట్స్ , కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ లలో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీల నుండి నిమ్మగడ్డ 854 కోట్లు వివిధ సందర్భాల్లో ఉపసంహరిచుకున్నారని సీబీఐ వెల్లడించారు. ఇంక జగన్ కంపెనీల్లో రూ 500 కోట్ల దాకా పెట్టుబడులు కొనసాగుతున్నాయాని సీబీఐ తెలిపింది. అయితే మొత్తం మీద వాన్ పిక్ ప్రాజెక్ట్స్ పేరుతో భూమి విలువ రూ .1400 కోట్లుకు జగన్ కంపెనీల్లో కొనసాగుతుందట. అంతేకాకుండా మరో రూ .500 కోట్ల పెట్టు బడులకు సమానంగా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేసే అవకాశాలు ఉన్నాయాని మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఈ జప్తు ప్రక్రియా దసరా కు ముందే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
