
కొత్తగా పార్టీ పెట్టిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా అవినీతి ఆరోపణలు చేశాడు. నీకిది-నాకది (క్విడో ప్రో కో) పద్దతిలో ప్రముఖ స్థిరాస్తి వ్యాపార సంస్థ డీఎల్ ఎఫ్ కు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా లబ్ధి చేకూర్చి వందల కోట్ల లబ్ధి పొందారని ఆరోపించారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాత్రం ఇవన్నీ అబద్ధం అంటున్నారు . మా బావ వ్యాపారవేత్త అని రాహుల్ చెబుతున్నాడు. ఆయన చాలా మంచివాడని వెనకేసుకొచ్చారు. సోనియా గాంధీ కూడా తన అల్లుడు ఒక వ్యాపార వేత్త అని , ఆయన ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. అల్లుడు పై ఆరోపణలు వచ్చిన ఒక గంటకే ఆమె ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. రాబర్డ్ వాద్రాకు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లు రక్షణగా నిలిచారు. అంతే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలో నిజం లేదని కేంద్ర మంత్రి అంబికా సోనీ అన్నారు. వ్యాపారం చేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. రాబర్డ్ వాద్రా కూడా ఈ దేశ పౌరుడు. ఆయన ఏ వ్యాపారం అయినా చేసే హక్కు ఆయనకు ఉందని ఆమె అన్నారు. డీఎల్ ఎఫ్ అనేది ఒక వ్యాపార సంస్థ . తనకు ఇష్టం వచ్చిన షరతులతో ఎవరికీ అయినా రుణం ఇచ్చే హక్కు ఆ సంస్థ కు ఉంది . అలాగే తనకు నచ్చిన షరతులతో ఏ సంస్థ నుంచి అయిన రుణం తీసుకునే హక్కు వ్యాపారవేత్తకు ఉంటుందన్నారు.
