19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Oct 03 ,2012 03:19 pm

    chandrababu naidu new style

    తి రాజకీయ నాయకులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ను ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటారు.  దివగంత రాజశేఖర రెడ్డి .. తన కుడి చెయ్యిని  గాలిలోకి ఊపుతూ ప్రజలకు దగ్గరయ్యాడు. అలాగే చంద్రబాబు నాయకుడు కూడా  తన రెండు వేళ్లు  ‘వి’ ఆకారంలో చూపించి  రాష్ట్ర ప్రజలకు తమ విక్టరీ  చూపించేవారు. ఆయన ఎక్కడి వెళ్లిన తన విక్టరీ ఆకారం చూపించి ప్రజలకు అభివాదం చేసేవారు. చంద్రబాబుకు, ఆ విక్టరీ గుర్తుకు అంత అనుబంధం ఉంది మరి! కానీ, 'వస్తున్నా.. మీకోసం' అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఆ విక్టరీ గుర్తును వదిలిపెట్టేశారు. చక్కగా సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం పెడుతున్నారు. పాదయాత్ర తొలిరోజే ఈ మార్పును చూపించి పార్టీ వర్గాలను కూడా ఆయన ఒక్కసారిగా విస్మయానికి గురి చేశారు.వాస్తవానికి, బయటకు ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపించడం చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఆనవాయితీ. ఆయనను చూడగానే సాధారణ ప్రజలు కూడా అవే రెండు వేళ్లను చూపించడం ఒక అలవాటుగా స్థిరపడిపోయింది. చంద్రబాబు ఈ విక్టరీ సంకేతాన్ని చూపించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇందిరా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుర్తుగా హస్తం వచ్చిన తర్వాత దానిని స్ఫురింపజేసేలా ఆ పార్టీ నేతలు అరచేతిని ఊపేవారు.

    chandrababu naidu new style

    ఆ పార్టీకి ప్రత్యర్థిగా పుట్టిన టీడీపీ నేతలకు దానికి భిన్నంగా ప్రజలకు ఎలా అభివాదం చేయాలన్నది పెద్ద సమస్యగా ఉండేది. తమిళనాడును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బాబు ఈ విషయంలో తమిళ తంబిలను ఆదర్శంగా తీసుకొన్నారు. అక్క డ జయలలిత పార్టీ అన్నాడీఎంకే గుర్తు రెండాకులు. దానికి గుర్తుగా జయలలిత మొదలుకొని ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లినా రెండు వేళ్లు చూపించేవారు. హస్తానికి ప్రత్యామ్నాయంగా ఇది బాగుందనుకొని బాబు అదే పద్ధతిని తానూ పాటించడం మొదలు పెట్టారు. ఇక్కడ దానికి విక్టరీ సంకేతంగా పేరు పెట్టారు.సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబు సింబల్‌గా 'వి'గా స్థిరపడిపోయింది. కానీ, తొలిసారిగా పాదయాత్రలో బాబు విక్టరీ సంకేతాన్ని పక్కనపెట్టారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసేటప్పుడు విక్టరీ సంకేతం చూపించడం సరైంది కాదని, దాని బదులు చక్కగా నమస్కారం చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. బాబు అక్షరాలా ఆచరించి చూపించారు. తొలిరోజు పాదయాత్రలో పార్టీ నేతలు, సాధారణ ప్రజలు అలవాటు కొద్దీ ఆయనకు విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్నా బాబు మాత్రం వారికి నమస్కారం పెడుతూ సాగిపోయారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers