
ఇలియాన పేరు వింటే చాలు పోకిరి కుర్రోళ్లు నుండి జులాయి కుర్రోళ్లు వరకు కరెంట్ షాక్ కొడుతుంది. ఆమె పేరులో ‘ఇలియానా’ అన్న నాలుగక్షరాల పేరు కుర్రకారును కిర్రెక్కిస్తోంది. టాలీవుడ్‌లో టాప్ పొజిషన్ చూసి నేడు బాలీవుడ్‌లోనూ భళారే అనిపించింది. నవంబర్ 1న ఇలియానా బర్త్ డే. ఈ సందర్భంగా ఇలియానా కు తెలుగువిశేష్ శుభాకాంక్షలు తెలుపుతుంది. ఈ గోవా పిల్లకు కొత్త గోకుడు ఎక్కువేనని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ముంబై చేరి బాలీవుడ్‌లో రాణించాలని కలల్లో తేలిపోయింది గోవా సుందరి ఇలియానా. అక్కడ అవకాశాలు లేకపోవడంతో తెలుగునాట అడుగు పెట్టి తొలి రెండు సినిమాలతోనే నంబర్‌వన్ నాయిక అయిపోయింది. ఆ తరువాత ఇలియానా ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. తెలుగు నిర్మాతలు ఆమె డేట్స్ కోసం రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోయారు. అగ్రహీరోల సరసన ఒక్క చిత్రంలోనూ నటించకున్నా, యంగ్ టాప్ హీరోస్ అందరి సరసన తనదైన బాణీ పలికించింది ఇలియానా. దాంతో జయాపజయాలకు అతీతంగా ఇలియానా రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతూనే పోయింది. కోలీవుడ్‌వైపు సాగినా, అక్కడ ఎందుకనో ఆమె నటించిన రెండు చిత్రాలు అంతగా ఆదరణ పొందలేదు. తెలుగునాట అమ్మడి డౌన్ ఫాల్ ఆరంభమయిన రోజుల్లోనే హిందీలో 'బర్ఫీ' చేసింది. అదృష్టమేమోకానీ, ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ సక్సెస్‌నూ సాధించింది. దాంతో హిందీజనం ఇలియానా వెంట పడ్డారు. ఆమె డేట్స్ కోసం అక్కడ కూడా పోటీ మొదలయింది. బాలీవుడ్ ధ్యాసలో పడి, నటిగా తనకు జన్మనిచ్చిన టాలీవుడ్‌పై విముఖత చూపుతోందట. మరి ఇలియానా భవిష్యత్తులో ఏ రీతిలో అలరిస్తుందో చూడాలి