ఒలింపిక్స్ భద్రతకు క్షిపణుల మోహరింపు చర్యలు ఇం గ్లండ్‌లో దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో సవా ల్ చేసేందుకు లండన్ వాసులు సన్నద్ధమవుతున్నారు. స్థానికుల నివాసాలపై క్షిపణులను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించడమే భద్రత చర్యలపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణం. ఒలింపిక్స్‌కు ఉగ్రవాద ముప్పు పొంచివుందన్న ఇంటలిజెన్స్ నివేదిక మేరకు రక్షణ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా లండన్‌లోని ఆరు ప్రాం తాల్లో భూపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్టార్‌స్ట్రీక్ క్షిపణులను మోహరించాలని నిర్ణయించారు. లండన్‌కు తూర్పు ప్రాంతంలోని లెగ్జింటన్ బిల్డింగ్, మరో 17 అంతస్తుల ఫ్రెడ్‌విగ్ టవర్‌పైన ఈ క్షిపణుల్ని ఉంచాలని నిర్ణయించారు.
ఇళ్లపై క్షిపణుల్ని ఏ ర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించనున్నట్టు లండన్ తూర్పు ప్రాంత ప్రజలు తెలిపారు. క్షిపణుల మోహరింపు విషయంపై రక్షణ శాఖ అధికారులు స్థానికులను సంప్రదించలేదని హొవీ అండ్ కో న్యాయవాదుల బృందం తెలిపింది. ఇది మానవ హక్కులను హరించడమేనని పేర్కొన్నారు.
