
ఈసారి యూరో సాకర్ చాంపియన్‌షిప్ పోటీల్లో చివరి వరకూ శక్తివంచన లేకుండా పోరాటం సాగించామని, అందుకే సెమీస్‌లో ఓడినందుకు తాము బాధపడడం లేదని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వ్యాఖ్యానించాడు. లీగ్ దశలోనేగాక, క్వార్టర్ ఫైనల్‌లోనూ తమ జట్టు అద్భుతంగా రాణించిందని విలేఖరులతో మాట్లాడుతూ రొనాల్డో చెప్పాడు. స్పెయిన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ గట్టిపోటీనిచ్చామని అన్నాడు. ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌ను ఒక్క గోల్ కూడా చేయకుండా నిలువరించడమే పోర్చుగల్ ఏ స్థాయిలో ఆడిందో రుజువు చేస్తున్నదని పేర్కొన్నాడు. పెనాల్టీ షూటౌట్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఈ ఒక్క అంశాన్ని మినహాయిస్తే మొత్తం మీద ఈ టోర్నీలో పోర్చుగల్ ఆట సంతృప్తికరంగా ఉందని రొనాల్డో చెప్పాడు. సెమీస్‌లో ఓడినప్పటికీ నైతిక విజయం తమదేనని వ్యాఖ్యానించాడు.