25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • Pranabs.gif

    Jul 23 ,2012 04:51 pm

    Pranabs sisters on way to Delhi for his swearing-inసోదరి అంటే వైఎస్ జగన్  సోదరి షర్మిలా కాదండి?  మన కొత్త రాష్ట్రపతి  అయిన ప్రణబ్ ముఖర్జీ  సోదరి  అన్నపూర్ణ దేవి? రాష్టప్రతి అశ్వం ఎందుకు కావాలి? నువ్వు ఈ జన్మలోనే రాష్టప్రతివి అవుతావు’ అని సోదరి అన్నపూర్ణాదేవి ఆయనతో అన్నారు. యుపిఎ రాష్టప్రతి అభ్యర్థి 76 ఏళ్ల ప్రణబ్‌ ముఖర్జీ కన్నా పదేళ్లు పెద్ద అయిన అన్నపూర్ణాదేవి ‘సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌’ టివి విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గుర్తు చేసుకున్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ఎంపి అయిన కొత్తల్లో ఆయనతో ఆమె సంభాషిస్తున్నారు. వారుభయులు న్యూఢిల్లీలోని ఆయన అధికారిక క్వార్టర్స్‌ వరండాలో కూర్చుని తేనీరు సేవిస్తున్నారు. ‘అతని ఇంటి నుంచి రాష్టప్రతి భవన్‌ ఎంతో దూరంలో లేదు. రాష్టప్రతి అశ్వాలను నడిపించే మార్గం మేము వరండాలో నుంచే చూడగలిగేవారం. ఆశ్విక రక్షకుడు వాటిని పోషించడం, వాటికి ఆహారం పెట్టడం, నీరు తాగించడం చూడగలిగేవారం. టీ సేవిస్తూండగా ‘అక్కా! ఆ గుర్రాలు ఎంత హాయిగా ఉన్నాయో... అలా చూడు.. అవి పని చేయనక్కరలేదు. అవి తింటాయంతే. వాటి రంగుల మెరుపు చూడు. నేను చనిపోయిన తరువాత రాష్టప్రతి గుర్రంగా జన్మిస్తాను’ అని అతను అన్నాడు. అప్పుడు ‘రాష్టప్రతి గుర్రంగా ఎందుకు కావడం? నువ్వు ఈ జన్మలోనే రాష్టప్రతివి అవుతావు’ అని నేను అన్నాను’ అని అన్నపూర్ణాదేవి తెలియజేశారు. తన జోస్యం ఫలించినందుకు ఆయన సోదరి ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers