కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీష్ శెట్టర్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్. భరధ్వజ్ ఆయనచే ప్రమాణం చేయించారు. జగదీష్ శెట్టర్ కర్ణాటకకు 27 వ ముఖ్యమంత్రి. ఆయనతో పాటు ఉప ముఖ్య మంత్రులుగా కే.ఎస్ ఈశ్వరప్ప, అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు. జగదీష్ శెట్టర్ కేబినేట్‌లో మొత్తం 32 మందికి చోటు దక్కింది. రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, అనంతకుమార్, పలువురు ప్రముఖులు హజరయ్యారు. గత సాధారణ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఆ పార్టీకి చెందిన మూడో ముఖ్యమంత్రి శెట్టార్. శెట్టార్ మంత్రివర్గంలో 32 మందికి చోటు దక్కింది. కాగా శెట్టార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.
