ఉప రాష్ట్రపతి పదవికి ఆగస్టు 7న ఎన్నిక నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భేటీ అనంతరం కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ, ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. నామినేషన్ల దాఖలుకు 20వ తేదీవరకు గడువుంటుందని, మరునాడు పరిశీలన, ఉపసంహరణకు 23దాకా సమయమిచ్చామని వివరించింది..