19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Jul 02 ,2012 08:58 pm

    కర్ణాటక బీజేపీలో నెలకొన్న సంక్షోభం తొలగిపోయింది. బీజేపీ అధిష్టానం హామీ మేరకు తొమ్మిది మంది మంత్రులు తమ పదవులకు చేసిన రాజీనామాలను సోమవారం ఉపసంహరించుకున్నారు. సీఎం సదానంద గౌడ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ యడ్యూరప్ప వర్గీయులైన తొమ్మిది మంది ఎమ్మెల్యేల శుక్రవారం రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. కర్నాటక రాష్ట్ర ప్రజలు ఏమాత్రం ఊహించని రీతిలో అధికార బిజెపిలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి.

    తాము సూచించిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాల్సిందేనని పట్టుబడుతూ రాజీనామాలు సమర్పించిన తొమ్మిది మంది మంత్రులు సోమవారం అనూహ్యంగా వాటిని వెనక్కి తీసుకున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై తమ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని అందుకే తాము రాజీనామాలు ఉపసంహరించుకున్నట్లు సదరు మంత్రులు ప్రకటించారు. అధిష్టానంతో మరోసారి చర్చించాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers