
గోషామహాల్ స్టేడియం సమీపంలోని బాలయ్య బాడ బస్తీలో చిన్న విస్ఫోట నం సంభవించడం స్థానికంగా అలజ డి సృష్టించింది. నగరవ్యాప్తంగా కూ డా బాంబుపేలుడు సంభవించిందనే పుకార్లు వ్యాపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. బాలయ్యబాడ బస్తీలో రాజేంద్ర గ్లాస్ గోడౌన్ ఉంది. మ ధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో గోడౌన్ గోడలో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గోడౌన్‌లో పనుల్లో నిమగ్నమై ఉన్న సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురై బయటకు ఉరుగులు పరుగులు తీశారు. కొద్దిసేపు ఏంజరిగిందో ఏంటో ఎవరికి అ ర్థం కాలేదు. అదే సమయంలో స్టేడియంలో ఉన్న పలువురు పోలీసులు కూడా శబ్దం విన్నా రు. వారు వెంటనే బయటకు వచ్చి గోడౌన్‌లో పేలుడు సంభవించిందని స్థానిక షాయినాథ్ గంజ్ పోలీసులకు సమాచారమందించారు. సీఐ సత్తయ్యగౌడ్ బృందం వెంటనే అక్కడికి చేరుకుంది.