టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే‑ కెప్టెన్ లక్ష్మీకాంతారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైఎస్ విజయమ్మ చేనేత దీక్షను భగ్నం చేసేందుకు యత్నిస్తారనే సమాచారంతో టీఆర్ఎస్, నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్‑లు చేశారు. అలాగే కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‑ రావును కూడా అరెస్ట్ చేశారు. జిల్లాలో ఇంతవరకు 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. కొండపాకలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్‑ను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. సిద్ధిపేటలో ఓ విత్తనాల కంపెనీలో బస చేసిన హరీష్‑రావును పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి తరలించారు. మెదక్ జిల్లా గజ్వేల్‑లో టీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్‑‑ సహా మరో 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.