అక్రమ గనుల నిందితుడు అయిన ‘‘గాలి జరార్థన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసు’’లో మరో వికెట్ పడింది. సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో స్మాల్ కాజస్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాదిని ఏసీబీ ఈ రోజు అరెస్టు చేసింది. మొన్న అరెస్ట్ అయిన రౌడీ షీటర్ యాదగిరి పోలీసులకు కేసుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెబుతుండటంతో దీని వెనుక ఉన్న వారు ఒక్కక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టులో ఖర్చు పెట్టడం కోసం 5 కోట్లు ఖర్చు పెట్టడానికి కేటాయించామని యాదగిరి రావు చెప్పాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే డబ్బు భారీగానే చేతులు మారిందని అర్థం అవుతోంది. ముందు ముందు ఇంకెందరు ఈ కేసులో ఊచలు లెక్కబెడతారో చూడాలి.
అలాగే ఎన్నికల సంఘం న్యాయవాదిగా ఉన్న జస్టిస్ ప్రభాకర్‌రావును శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా నియమించిన హైకోర్టు బెయిల్ ఫర్ స్కాం కేసులో ఆరోపణలు రావడంతో శుక్రవారం (6వ తేదీన ) హైకోర్టు సప్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గాలి బెయిల్ వ్యవహారంలో ప్రభాకరరావు రౌడీషీటర్ యాదగిరితో కలిసి మద్యవర్తి పాత్ర పోషించినట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ప్రభాకరరావును హైకోర్టు ఈ మేరకు సస్పెండ్ చేసింది.
