ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి అక్రమాస్తుల కేసులో ఊరట లభించింది. అధికారంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయావతికి సుప్రీం కోర్టులో ఊరట అభించింది. . 2003లో కోటి రూపాయల ఉన్న ఆమె ఆస్తి 2007 నాటికి 50 కోట్ల రూపాయలకు చేరుకోవటంతో సిబిఐ విచారణ ప్రారంభించింది.
అయితే వీటికి సంబంధించి సాక్ష్యాధారాలు సరిగా లేవని అందుకే ఈమె పై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, సీబీఐ తమ ఉత్తర్వులను సరిగా అర్ధం చేసుకోకుండా దర్యాప్తు చేపట్టిందని సుప్రీంకోర్టు పేర్కొంది. తాజ్ కారిడార్ కుంభకోణం మినహాయించి మరే ఇతర అంశాలను పరిగణించబోమని న్యాయస్థానం తెలిపింది. ఈ తీర్పుతో మాయావతి ఉన్న ఆరోపణలు తొలిగిపోయినట్లే.