స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి. విదేశీ నిధుల భారీ ప్రవాహంతో సెన్సెక్స్ 410 పాయింట్లు లాభపడి రెండు నెలల గరిష్ఠస్థాయికి చేరి 17,496 పాయింట్ల వద్ద ముగిసింది. జనరల్ యాంటీ ట్యాక్స్ అవాయిడెన్స్ రూల్స్(గార్) మార్గదర్శకాలను గురువారం రాత్రి విడుదల చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. విదేశీ, దేశీయ కొనుగోళ్లతో అటు నిఫ్టీ కూడా 120 పాయింట్లు లాభపడి 5,260 వద్ద ముగిసింది.