నిజాయితీగా ఆదాయపు పన్ను ఆఫీసులకు వెళ్ళి పన్ను చెల్లించే వారి కష్టాలు త్వరలో తీరనున్నారు. ఎందరో దేశంలో పన్ను ఎగ్గొట్టి తిరుగుతుంటే.. నిజాయితీగా పన్ను కడదామని పోతే గంటల కొద్ది టైం వేస్టు చేసుకోవాలి. ఇక ముందు ఆదాయపు పన్ను ఆఫీసుల ముందు బార్లు తీరాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఏటీఎం తరహాలో బెంగుళూరులో ట్యాక్స్ స్మెల్ సంస్థ ఆదాయపు పన్ను చెల్లింపునకు ఏటీఎఫ్ ని ఏర్పాటు చేసింది. బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసే విధంగా ఏటీఎఫ్ కేంద్రం నుంచి సులభంగా పన్ను చెల్లించి రసీదు పొందవచ్చు. పన్ను చెల్లింపు ధరఖాస్తును యంత్రంలో వేసిన తరువాత... యంత్రం తెర పై వచ్చే సూచనలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు అనీల్ కుంబ్లే అన్నారు.