
గతవారమంతా భారీగా పడిపోయిన విదేశీమారక నిల్వలు ఈవారంలో తిరిగి పుంజుకున్నాయి. ఈనెల 8తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.5 బిలియిన్ డాలర్లు పెరిగి 287.38 బిలియి న్ డాలర్లకు చేరుకున్నాయి అంతకుముందు వారంలో ఇవి 2.40 బిలియన్ డాలర్లు క్షీణించి 285.86 బిలి యన్ డాలర్ల స్థాయికి చేరాయి. జూన్ 8తో ముగిసిన వారానికి ఫారిన్ కరెన్సీ ఆస్తులు 1.50 బిలియిన్ డా లర్ల వృద్ధితో 254.60 బిలియిన్ డాలర్లకు పెరిగాయి. ఈకాలంలో బంగారం నిల్వలు 25.58 బిలియిన్ డాలర్ల వద్ద నిలకడగా వున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 13.3 మిలియిన్ డాలర్లు పెరిగి 4.360 బిలియిన్‌లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత మారక నిల్వలు కూడా 8.7 మిలియిన్ డాలర్లు వృద్ధి చెంది 2.840 బి లియిన్ డాలర్లకు చేరాయి