Tamanna playing role in baahubali movie

Tamanna in Baahubali, tamanna to pari with prabhas, tamanna,Tamanna playing role in Baahubali,Baahubali and Shivudu, Tamanna plays a lead role.

Prabhas is playing a dual role in the movie as Shivudu and Baahubali, as we all know that Anushka is already playing a role of Deva Sena.

మిల్కీబ్యూటీకి రాజమౌళి సినిమాలో ఛాన్స్

Posted: 12/20/2013 06:36 PM IST
Tamanna playing role in baahubali movie

‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా ’ అన్నట్లు... మన దర్శకధీరుడు రాజమౌళి తలుచుకుంటే తన సినిమాలో ఎంతమంది స్టార్లనైనా పెట్టుకొంటాడు. రాజమౌళి ప్రస్తుతం యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి ’.

ఇప్పటికే భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ చేరిపోయింది. మిల్కీబ్యూటీ తమన్నా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటి వరకు రాణాకు జతగా చాలామంది హీరోయిన్ల పేర్లు వచ్చినా వాటిలో ఏవీ నిజం కాలేదు. కానీ రేపు తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ‘బాహుబలి ’లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించి సర్ ప్రైజ్ జేశాడు. ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రాణా పుట్టిన రోజులకు బర్త్ డే గిప్టులుగా మేకింగ్ వీడియోలు గిఫ్ట్ గా ఇచ్చిన జక్కన్న తమ్మూ పుట్టిన రోజు కానుకగా ఆ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలు పోషిస్తున్నాడట. ఒకటి బాహుబలి పాత్ర కాగా మరొకటి శివుడు పాత్ర. ఇప్పటికే బాహుబలి పాత్ర సరసన దేవసేనగా అనుష్క కథానాయికగా నటిస్తుండగా.. శివుడు పాత్ర పక్కన అవంతికగా తమన్నా నటిస్తోంది. అంతేకాదు ఇప్పటికే తమ్మూ ఈ షూటింగులో కూడా జాయిన్ అయిందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని డిసెంబర్‌ 23 నుంచి రామోజీ ఫిలింసిటీలో ప్రారంభిస్తున్నాం.

ఈ యాక్షన్ సన్నివేశాలలో జూనియర్ ఆర్టిస్టులు 500 మందికి పైగా పాల్గొంటుండగా మొత్తం 2000 మందితో ఈ సన్నివేశాలను షూట్ చేయనున్నామని, మార్చి 5 వరకు రామోజీ ఫిలింసిటీలోనే ఈ షెడ్యూల్‌ జరుగుతుందని నిర్మాత శోభుయార్ల గడ్డ తెలిపారు. జక్కన్న సినిమాలో ఛాన్స్ రావడంతో మిల్కీ బ్యూటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: అజయ్‌, విజయ్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: వి.శ్రీనివాస్‌మోహన్‌, సౌండ్‌ ఇంజనీర్‌: పి.ఎం.సతీష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు శిరిల్‌, స్టైలింగ్‌: రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more