Eid ul fitr festival

eid ul fitr festival, Ramzan month, Ramzan fasting, Ramzan successful completion, Eid Mubarak, Shawwal month, Shawwal fasting

eid ul fitr festival of Muslims

ఈద్ ముబారక్

Posted: 08/09/2013 11:08 AM IST
Eid ul fitr festival

సంవత్సరంలో ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఈద్ ఉల్ ఫిత్ర్ ఒకటి.  చాంద్రమానం ప్రకారం ముస్లింలు అనుసరించే పంచాంగం ప్రకారం తొమ్మిదవ నెల రంజాన్.   ఈ రంజాన్ మాసంలో పగటి పూటంతా ఏమీ తినకుండా తాగకుండా, కనీసం పచ్చి మంచినీళ్ళైనా తీసుకోకుండా గడిపి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే తిని గడపటం ఆనవాయితీగా వస్తోంది.  ఈ రోజుల్లో కనీసం నాలుగు సార్లు నమాజు చెయ్యటం, ఖురాన్ చదివి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యటం చేస్తారు. 

రంజాన్ మాసాంతంలో ప్రార్ధనలు అయిన తర్వాత పదవ నెలయిన షవ్వల్ లో మొదటి రోజు పండుగ జరుపుకోవటమే ఈద్ ఉల్ ఫిత్ర్.  రంజాన్ మాసంలో వారి ఉపవాస దీక్ష విజయవంతమైన సంబరాలు చేసుకునేదే ఈద్ ఉల్ ఫత్ర్.  ఈ రోజు రెండు నకాత్ లు చేసిన తర్వాత శ్రద్ధగా మతాధికారుల హితోపదేశాలు విని, ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముబారక్ (అభినందన) తెలుపుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు.

కొందరు ముస్లింలు షవ్వల్ లో ఆరురోజుల పాటు ఉపవాసం చేస్తారు.  రంజాన్ నెలతో పాటు షవ్వల్ లో ఆరు రోజులు చేసే ఉపవాస దీక్ష సంవత్సరమంతా చేసినదానితో సమానమని వారి నమ్మకం.  అయితే షవ్వల్ లో మొదటి రోజు ఉపవాసం చెయ్యటం నిషేధం.  ఈ రోజు అందరూ పండుగ జరుపుకునేరోజు.  కాబట్టి రెండవ రోజు నుంచి ఆరు రోజులు ఉపవాస దీక్షలో కొందరు పాల్గొంటారు.

ఈద్ రోజున పండుగ ప్రార్ధనలు పూర్తైన తర్వాత ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు పండుగకు కావలసిన కొనుగోళ్ళు చేస్తారు.  కొత్తబట్టలు, చెప్పులు, టోపీలు వగైరాలు.  హైద్రాబాద్ లో లాల్ దర్వాజా దగ్గర మహిళలు గాజులు, స్త్రీల అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తారు.

రాష్ట్రమంతా ఈద్ ఉల్ ఫిత్ర్ సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ సందర్భంగా తెలుగు విశేష్ తరఫునుంచి ముస్లింలందరికీ ఈద్ ముబారక్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more