
డెంగీ జ్వరానికి కొత్త మందు కనిపెట్టారు మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్. డెంగీ నుంచి రక్షణ పొందాలంటే ఒక్కటే మార్గం ఉందని ఆయన తేల్చి చెప్పారు. డెంగీ నుండి రక్షణ పొందాడానికి ‘యూనిఫామ్’ మార్చితే డెంగీ ఫివర్ రాదని ఆజాద్ చెప్పారు. డెంగీ పెరగటానికి కారణం దోమ కాదట? విద్యార్థులు వేసుకొనే యూనిఫామ్ అని ఆయన అంటున్నారు. ముందు విద్యార్థులకు యూనిఫామ్ మార్చితే డెంగీని అరికట్టవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ధరిస్తున్న హాఫ్ ఫ్యాంటు, హాఫ్ షర్టుతో డెంగీ ఫివర్ కేసులు పెరుగుతున్నాయాని ఆరోగ్య శాఖ మంత్రి గుర్తించారు. ఇప్పుడు యూనిఫామ్ స్థానంలో కొత్తగా పుల్ షర్టు, ఫుల్ ఫ్యాంటును ధరించేలా యూనిఫామ్ ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. అందుకు ముందుగా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఇందుకు సహకరించాలని ఆజాద్ కోరారు. ఈ విధంగా ఎంత త్వరగా అమలు జరిగితే అంత మంచిదని ఆయన అన్నారు. కనీసం రెండు , మూడు నెలల వరకైనా ఈ విధానం అమలయ్యేలా రాష్ట్రాలు పని చెయాలని ఆయన సూచించారు. ఆరోగ్య శాఖ మంత్రుల సదస్సులో ఆజాద్ చెప్పిన డెంగీ సూత్రం ఇది. ఈ సదస్సులో తమిళనాడు, కర్ణాటక, కేరళ పుదుచ్చేరిల ఆరోగ్య శాఖ మంత్రులు , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు దోమలు కుట్టకుండా చూసే బాధ్యత విద్యాశాఖ మంత్రులపై ఉందని ఆయన గుర్తు చేశారు.
