20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Fish.gif

    Oct 13 ,2012 12:58 pm

    Fish oils can stave off heart disease

    ఇది పాస్ట్ పుడ్ కాలం. ఐదు నిమిషాల్లో  మన తినే ఐటమ్ మన కళ్లేదురుగా ఉండాలి.  లేదంటే మనలో  బీపీ పెరిగిపోతుంది. మన ఎంత ఫాస్ట్ పుడ్ కోరుకుంటమో ..అంతే మన జీవితం కూడా స్పీడ్ గా తరిగిపోతుంది. మనం తీసుకునే ఆహారం వలన మనకు కొత్త జబ్బులు వస్తున్నాయి. మనకు  సహజ సిద్దమైన ఆహారం మన కళ్లే ముందు ఉంటుంది. కానీ మనం వాటిని పట్టించుకోం. పక్రుతి లో మనిషికి కావాలసిన  ఆహార సంపద పుష్కలంగా ఉంది. కానీ మనం వాటిని వదిలేసి ..రెఢీమెడ్ ఫుడ్ కు అలవాటు పడిపోయం. మనిషి ప్రాణాలకు పెద్ద ముప్పు వాటిల్లుతుంది. మనిషి  వారానికి రెండు,  మూడు సార్లు  చేపలు తిన్నా లేకపోతే చేపనూనె  మాత్రలు  వేసుకున్నా  గుండెజబ్బుల బారిన పడకుండా  కాపాడుకోవచ్చని  తాజా అధ్యయనంలో  వెల్లడైంది.  ముఖ్యంగా  ఈ ప్రభావం మహిళల్లో మరింత ఎక్కువగా  కనపబడుతుంది. రక్తనాళాల పై సాగే  గుణాన్ని  నియంత్రించే  కండర కణాలపై  చేప నూనె  నేరుగా ప్రభావం చూపుతున్నట్లు  రీడింగ్  విశ్వవిద్యాలయం  పరిశోధకులు  గుర్తించారు.  ఈ అధ్యయనంలో కొవ్వుతో కూడిన ఆహారం  తినే కొందరు స్త్రీలు, పురుషులకు కొద్ది మోతాదులో  చేపనూనె  కూడా  తీసుకోవాలని  సూచించారు.  దీంతో కండరం సాగే గుణం  స్త్రీలల్లో  నాలుగు రెట్లు, పురుషుల్లో  రెండు రెట్లు  పెరిగినట్లు  గుర్తించారు.  చేప నూనెకు  రక్తనాళాల గోడల  నుంచి నైట్రిక్  ఆక్సైడ్  విడుదలను  పెంచే గుణముంది. దీంతో  రక్తనాళాలు విప్పారి రక్త ప్రసరణ సాఫిగా జరుగుతుంది. 

    Fish oils can stave off heart disease

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers