23 May Thursday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • Oct 11 ,2012 08:45 pm

    shermila-padayatra

    రాష్ట్రంలో పాదయాత్రల జాతర మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రలు మగవారికే పరిమితం అయ్యాయి. కానీ త్వరలో  ఒక మహిళ పాదయాత్ర చెయ్యటానికి  సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.  ఆమె ఎవరు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి  కూతురు  షర్మిలా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యాటానికి  పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపటానికి షర్మిలా పాదయాత్రకు పూనుకుందని  తెలుస్తోంది.  తమ పార్టీని  ప్రజల్లో మరింత చేరువగా తీసుకుపోవటానికి  ఆమె నడుం బిగించినట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.  జగన్ జైల్లో ఉండటం వలన పార్టీ కి పెద్ద నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో  షర్మిలా పాదయాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.  నాటి సువర్ణయుగం త్వరలోనే వస్తుందని ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. వైఎస్ చేపట్టిన 'ప్రజాప్రస్థానం' ను షర్మిలా మరోసారి కొనసాగించనున్నట్టు విజయమ్మ తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలుకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు.

    మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో.. ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉండాలని జగన్ చెప్పారని.. బెయిల్ పై విడుదలయ్యాక జగన్ పాదయాత్రను కొనసాగిస్తారని.. అప్పటి వరకు షర్మిల పాదయాత్రను నిర్వహిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని సాధారణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పన్నులు, సర్ ఛార్జీల పేరుతో ప్రజలను ఇబ్బందుల్లోకి ప్రభుత్వం తోసిందని విజయమ్మ అన్నారు. వైఎస్ పథకాలను కొనసాగించాలని అంటూనే మహానేతపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర, జగన్ ఓదార్పుయాత్రను అనుకరించడానికే తప్ప చంద్రబాబు పాదయాత్రతో జరిగేమిలేదని ఆమె అన్నారు. సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో పాదయాత్ర చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పాదయాత్రను చేపడుతున్నామన్నారు.  తమ పార్టీ చిన్నపార్టీ అని.. ప్రభుత్వాన్ని ఎదురించే శక్తి తమకు లేదని.. అందుకే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నా ఏమి చేయలేకపోతున్నామని.. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్పందించడంలేదని విజయమ్మ విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు చిదంబరం కలువగానే విచారణ లేకుండానే ఈడీ నోటీసులు జారీ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తో కుమ్మక్కైందనడానికి ఇంతకంటే రుజువు ఏమి అక్కర్లేదన్నారు.

    షర్మిలా పాదయాత్ర చేయ్యకముందే అప్పుడే విమర్శలు వచ్చాయి.  షర్మిలా పై తెలుగు దేశం పార్టీ  తెలుగు మహిళాధ్యక్షురాలు  శోభా హైమావతి విమర్శలు చేశారు.   షర్మిలా  దోచుకోవటానికి రాష్ట్రంలో  ఇంక ఏం మిగిలిందని  శోభా హైమావతి ప్రశ్నించారు.  2003లో వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో  ఎక్కడెక్కడ గనులు, భూములు, సంపద ఉన్నాయో పరిశీలించి  అధికారంలోకి  రాగానే వాటిని  దోచేశారని ఆమె ఆరోపించారు.  తండ్రి, కొడుకులు కలిసి  రూ. లక్ష కోట్ల ప్రజా సొత్తును  భోంచేశారన్నారు.  షర్మిళ ఏ హోదాదో  పాదయాత్ర  చేపడతారని , ఏ హోదాలో  ప్రజల సమస్యలు  పరిష్కరిస్తారని  నిలదీశారు.  పిల్ల కాంగ్రెస్ లో  షర్మిళ పదవి ఏంటని ఆమె ప్రశ్నించారు. దీనిపై షర్మిలా ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.  ఆ పార్టీ లో షర్మిలాకు ఏం పదవి ఇస్తారో .. చూడాలి... ?

Facebook Comments
Movie news
  •  Catherine to pair up with Ram Charan
Catherine Tresa, who made her acting debut with Neelakanta directorial Chammak Challo, will soon be seen opposite Mega Power Star Ram Charan Tej in Koratala Siva’s directorial venture, as per the reports.
  • Its the season of south actors making their way into Bollywood. After Prithviraj Sukumaran.
  • Salman khan going to marry her girl friend lulia vantur, salman khan wedlock with lulia vantur, Salman khan finds new girl friend romanian tv actress lulia vantur
  • Raghava Lawrence to direct Don 2 with Nagarjuna?, Raghava Lawrence to direct Don 2 with Nagarjuna, Lawrence to direct Don 2 with Nagarjuna, Nagarjuna Lawrence new movie, Lawrence Nagarjuna Don 2
  • Iam not acting in Bahubali: Rajamouli clarifies
  • Nagababu son Varun Tej is going debut soon on silver screen. Puri Jagan who is driving high on success will direct Varun Tej debut movie.It has become sentiment for Mega Heroes after Allu Arjun,Charan and now Varun Tej was introducing by Aswini Dutt. The makers were yet to finalize a suitable date. More Movie news
twhead twe

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers