
చంద్రబాబు ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర ఈ రోజు అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. బాబు చేస్తున్న పాదయాత్రకు మంచి స్పందన రావటంతో కాంగ్రెస్ నాయకులకు కొత్త భయం పట్టుకుంది. అందులో భాగంగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట అంటూ ప్రకాశం జిల్లాలో మూడు రోజులు యాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో ప్రజలు చంద్రబాబుకు అనేక సమస్యలు విన్నవించుకుంటున్నారు. తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని చంద్రబాబు అన్నారు. అయితే నేను పదవి కోసం కాదని ప్రజా రూణం తీర్చుకోవడానికే నేను పాదయాత్ర చేస్తున్నానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ని ఒక తల్లి పార్టీ గా అభివర్ణించారు చంద్రబాబు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల పార్టీ గా పోల్చి.. చెప్పారు. ఈ రెండు పార్టీలు దొంగల పార్టీలేనని ఆయన ఆరోపించారు. తల్లి పార్టీలో కలిసేందుకు పిల్ల పార్టీ చర్యలు మొదలు పెట్టిందన్నారు.

సామాజిక న్యాయం కోసం ఏర్పడిన ప్రజా రాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. అంతేకాకుండా సామాజిక న్యాయం అంటే కొందరి కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో వైకాపా నేతలంతా జైలుకెళ్ళారని , ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ఏకంగా సుప్రీం కోర్టే అడిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సారి చంద్రబాబు పాదయాత్రలో ముఖ్మంగా కొన్ని కులాలకు బాగా దగ్గరవుతున్నడని మీడియా వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు మాదిగలకు , ముస్లీంలకు, బిసీలకు మద్దతిస్తున్నామని ఆయన చెప్పారు.
