
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం టాలీవుడ్ హీరోలే కాక, బాలీవుడ్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. ఈయన దర్శకత్వంలో సినిమా చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలే కాకుండా బాలీవుడ్ స్టార్లు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను రూపొందించిన ‘ఈగ’ సినిమా హిందీలో విడుదల కాబోతుంది. తాజాగా అమీర్ ఖాన్ రాజమౌళి ఓకే అంటే తనతో సినిమా చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని, అతను ప్రభాస్ తో తీయబోయే సినిమాని హిందీలో చేయడానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. రాజమౌళి ఇటీవలే బాలీవుడ్ కి ఇప్పట్లో వెళ్ళే ఆలోచన లేదని అన్నారు. మరి అమీర్ ఖాన్ ఆపర్ ని రాజమౌళి స్వీకరించి ఎస్ అంటాడో లేదో చూడాలి.
