
ధర్మాన్ని రక్షించేందుకు, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవదేవి శనివారం అష్టమ తిథినాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారిని దుర్గమ్మ తల్లిగా అలంకరించేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో అమ్మవారిని దర్శనాన్ని నిలిపివేశారు.దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవి.. దివ్యఅలంకరణతో భక్తులను అనుగ్రహిస్తోంది. దివ్యప్రభలతో వెలుగొందుతోన్న ఈ దుర్గమ్మ తల్లి దుర్గముడనే రాక్షసుడిని సంహరించింది.
ఆది ప్రకృతి పంచమహా స్వరూపాల్లో దుర్గమ్మ మొదటిది. ఈ మాతను పూజిస్తే సర్వబాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దుర్గమ్మ స్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల భయాలు పోతాయని ప్రతీతి. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కొండకు తరలి వచ్చారు. అశేష భక్తజనంతో నిండిపోయిన ఇంద్రకీలాద్రిపై మహానవమి (ఆదివారం) ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.


















Business
Life Style
Movies
Galleries
Star Diary
Wallpapers
Leaders
Legends
Temples