
కలియుగ వైకుంఠం తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరోరోజైన ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు హనుమంత వాహనంపై తిరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. రాత్రి గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తజనం పోటెత్తుతోంది.
...avnk