తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన బుధవారం నాడు శ్రీనివాసుడు సింహవానంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిచ్చారు. ఆ దేవదేవుడిని చూసి భక్తులు పులకించి పోయారు. సాయంత్రం శ్రీవారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు స్వామివారు ముత్యపు వాహనంపై విహరించనున్నారు.