తిరుపతి మహతి ఆడిటోరియంలో సుప్రసిద్ధ సంగీత విద్యాంసులు ఘంటసాల వెంకటేశ్వర రావు ఆరోధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రముఖ గాయకులు తమ గానామృతంతో సంగీత అభిమానులను కట్టిపడేస్తున్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ, ఘంటశాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆరాధనోత్సవాలు తిరుపతి వాసులను అలరిస్తున్నాయి.