పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుంచి మన్నార్‌నాయనిపల్లె వరకు వున్న ఎంబీటిరోడ్డు పనులు నెల రోజులు అవుతున్నా పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కంకరతోలి దాన్ని రోడ్డుపై పరచి పది రోజులుగా విడిచిపెట్టేశారు. కంకర రోడ్డుపై నడవలేక వాహన చోదకులు, వృద్దులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈప్రాంతంలోని ప్రజలు ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆటోలు రావడం లేదని దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా కంకరపై నాణ్యమైన ఎర్రమట్టిని వేయాల్సి వున్నప్పటకీ కాంట్రాక్టరు నాసిరకం మట్టిని వేసేందుకు సిద్దం చేయడం పట్ల ఆ ప్రాంత వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాణ్యతాప్రమాణాలను కచ్చితంగా పట్టించుకోవాలని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.