తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాల్గవ రోజు స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. సప్త గిరీశుడు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. హరినామ స్మరణతో భక్త బృందాలు వాహన సేవలో పాల్గొన్నాయి. స్వామి వారికి సాయంత్రం వూంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు. స్వామి వారి ఉత్సవాలను కనులార వీక్షించి తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమల కొండలకు తరలివస్తున్నారు.