
ఆడవాళ్ళు తమ ముఖం మీద మొటిమలని, బ్లాక్‌హెడ్స్‌ని దాచుకోవడానికి వాటిని కవర్ చేయడానికి మేకప్ వేసుకోవడం సహజం. అలాంటి వారు మీరైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బ్యూటీషన్లు సూచిస్తున్నారు మేకప్ వేసుకోవడమే కాదు. ఆ సమయంలో చర్మ సంరక్షణని కూడా దృష్టిలో వుంచుకోవడం అవసరం. మంచి మేకప్ కోసం ముందుగా జిడ్డుగా వున్న ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోవాలి.మీ చర్మం ఏరకానిదో నిర్ణయించుకున్నాకే, క్లిన్సింగ్ మిల్క్‌ని వాడాల్సి వుంటుంది. మీది సాధారణ లేక పొడి చర్మమైతే నిరభ్యంతరంగా క్లీనింగ్ మిల్క్‌ని వాడవచ్చు. అయితే జిడ్డుకారే ముఖానికి క్లిన్సింగ్ మిల్క్ పనికిరాదు. వారికి ఫేషియల్ విధానమే మేలు చేస్తుంది. కాంప్లికేటెడ్ చర్మం కనుక మీదైతే మెడికేటెడ్ క్లిన్సింగ్ లోషన్‌ని వాడాల్సి వుంటుంది.క్లీనింగ్ కోసం మామూలు సబ్బులకు బదులు, మెడికేటెడ్ లేదా హెర్బల్ సోప్స్‌ను వాడటం మంచిది. లిక్విడ్ సోప్‌తో క్లీన్ చేసుకునేవారు సబ్బు పూర్తిగా తొలగిలే చూసుకోవాలి.