18 Jun Tuesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Sep 28 ,2012 06:29 pm

    hair_careచర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందు కనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే తలస్నానం అయ్యాక మగ్గునీటిలో అరకప్పు తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టును తడిపి రెండు నిమిషాల తరవాత తలపైనుంచి చల్లనినీటిని ధారలా పోయాలి.

    అరకప్పు తేనె తీసుకుని కుదుళ్ల నుంచి తలంతా రాసుకుని క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తరవాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మంచి నిగారింపు సంతరించుకుంటుంది. తలస్నానం చేసిన అరగంట తరవాత కప్పు తేనెకు పావుకప్పు ఆలివ్‌నూనె కలిపి.. తలకు మర్దన చేయాలి. పావుగంటయ్యాక కడుక్కుంటే సరిపోతుంది. ఫలితంగా జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. ఇలా పదిహేను రోజులకోసారి చేయాలి.

    అరకప్పు కొబ్బరినూనెను వేడిచేసి నాలుగు చెంచాల తేనె కలపాలి. కుదుళ్లకు రాసుకుని మర్దన చేయాలి. గంటయ్యాక తలస్నానం చేస్తే చాలు. జుట్టు రాలకుండా ఉంటుంది. కప్పు ఆలివ్‌నూనెకు, అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి తలకు మర్దన చేయాలి. అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers