19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 39.1.png

    May 29 ,2012 12:00 am

    Weight_loss

    Losing-Weightకొందరు ఎంత తిన్నా ఏమాత్రం లావెక్కకుండా సన్నగా ఉంటారు. మరి కొందరు కొద్దిగా తిన్నా విపరీతంగా లావెక్కుతారు. ఇలాంటి వారినే ఊబకాయులు అంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం మీదే బరువు పెరగడం, తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని చాలా మంది మరిచిపోతుంటాం. బరువు తగ్గాలనుకునేవారు ఈ కింది సూచనలను గుర్తు పెట్టుకోవాలి.ఆకలిని గుర్తించండి...
     ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలను అందిస్తుంది. ఆ సూచ నలను ఏమాత్రం గమనించకుండా ఆకలి అనిపించిన గంటో, గంటన్నర తరువాతో ఆహారం తీసుకోవడం వల న ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండి నట్లు అనిపిం చగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
    భోజనం చేయడం మరిచిపోకూడదు...

    ఎంత తిన్నా, ఏది తిన్నా, భోజనానికి సరికాదు అంటా రు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బరువు తగ్గాలను కునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అయితే మీరు తీసుకునే భోజనాన్ని తగ్గించుకొని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నాం, రాత్రి భోజనంలో వరికి బదులు రాగులు, గోధు మలు, సజ్జలూ ఉపయోగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి నాలు గు గంటలు ముందే భోజనం ముగించాలి.

    చక్కెరకు దూరంగా...

    బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.

    ఆందోళన, ఒత్తిడికి దూరంగా...

    బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పెై రెండిటి కారణంగా బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువెైంది.

    వ్యాయామం...

    వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉం టుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడ వడం అలవాటు చేసుకోవాలి. ఆటలు కూడా మంచి వ్యాయామా న్నిస్తాయి. పెద్ద వయస్సులో ఆటలు ఏమిటి? అనుకోనవసరం లేదు. పిల్లలను తీసుకొని ప్లే గ్రౌండ్‌కి వెళ్లినప్పుడు వారి ఆటల్లో పాల్గొన వచ్చు. పిల్లలతో కలిసి ఆడుకుంటే చాలు మరే ఇతర వ్యాయామాలు అక్కర్లేదు. ఇంతకు మించి పెద్దగా కష్టపడాల్సిన విషయాలేమీ ఉండవు.

    నిద్రలేమి...

    కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అం టారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers