19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 31.1.png

    May 05 ,2012 07:22 pm

    Bombay_High_Court

    కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పిల్లల్ని కనడానికి నిరాకరించిన భార్యకు విడాకులు ఇస్తానంటే కుదరదని బాంబే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వంట చేయడం రాకపోవడం, ధైవభక్తి ఉండకపోవడం, జీతం ఇంట్లో ఇవ్వకపోవడం, దుస్తులు సరిగా మడత పెట్టకపోవడం లాంటి విషయాలు భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రాతిపదిక కాజాలవని చెప్పింది. జస్టిస్ పి.బిజ మజుందార్, జస్టిస్ అనూప్ మొహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

    30 ఏళ్ళ రమేష్ షెనాయ్ విడాకుల కోసం కింది కోర్టులో దరఖాస్తు చేయగా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. దాంతో అతను ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. భార్య ప్రీతి తనపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, మొదటి రాత్రి తనను కండోమ్ లేనిదే సెక్స్ కి అనుమతించలేదని అన్నారు. ఆయన వాదనను కొర్టు త్రోసిపుచ్చింది. ఆర్థిక స్థిరత్వం లేనిదే పిల్లల్ని కనకూడదన్న ఆమె అభిప్రాయాన్ని తప్పు పట్టలేమని, పుట్టబోయే బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆమె భావిస్తూ ఉండొచ్చొని, పిల్లల్ని కనడం పరస్పర అంగీకారంతో తీసుకునే నిర్ణయమని, దీని పై భర్త ఒత్తిడి చేయడం కుదరదని స్పష్టం చేసింది.

    ఉమ్మడి కుటుంబంలో నివసిస్తూ, ఇంటి పనిలో పాల్పంచుకునే భార్య అయితేనే ఏలుకుంటానన్న పిటీషనర్ వాదనను న్యాయస్థానం తొసిపుచ్చింది. ‘భార్య బానిస కాదు, అర్థాంగి. ఆమె భావ వ్యక్తీకరణ స్వేఛ్చను లాక్కోవడం కుదరదు’ అని తేల్చి చెప్పింది. ‘పిటీషనర్ పేర్కోన్న అంశాలే భర్త పట్ల క్రూర ప్రవర్తనగా న్యాయస్థానం పరిగణిస్తే ఏ వివాహమూ నిలబబదు అని అభిప్రాయ పడింది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers