25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • The Effects of Heavy romance.png

    Oct 17 ,2012 09:04 pm

    Romanceదేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో పీకల్లోతు మునిగిపోయేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు అంటున్నారు. సాధారణ స్థితిని దాటిపోయి, అవధులు లేని శృంగారంలో మునిగిపోయేవారు కొంతకాలా నికి ఆత్మన్యూనతా భావాలకు లోనవడమే కాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారట.సాధారణ స్థాయిని మించిన శృంగారం లో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూ స్తుంటారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని యుహెచ్‌ మానసిక విభాగం అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ ఒకరు ఇటీవల వెల్లడించారు. అంతేకాదు ఇటువంటి సమస్యలో పీకల లోతుమునిగిపోయిన వారు ఒకరి కంటే ఎక్కువ భాగస్వాముల ప్రేమకై పరితపిస్తుంటారు. ఈ ప్రవర్తన దాంపత్య సంబంధా లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అతి శృంగార భావనలను మనసు నుంచి తొల గించే ప్రయత్నం చేయాలంటున్నారు. వివాహేతర సంబంధాలు, అనారోగ్యకరమైన సంబంధాలు సామాజిక సమస్యలనకు కూడా కారణమవుతున్నాయి. మితిమీరిన శృంగారం అనే అంశంపై కొందరు విద్యార్థులను పరిశీలించారు. ఆ పరిశీలనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు పరిశోధకులు. వారి ప్రవర్తనలో, ప్రత్యేకించి వారిలోని రొమాంటిక్‌ బంధాలు స్థిరంగా లేవు. హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మితిమీరిన శృంగార బంధాన్ని నెరపుతున్న వారిలో వారి బంధంపై నమ్మకం లేని స్థితిలో కొట్టుమిట్టాడటాన్ని గమనించారు.

    చాలనిపించడం లేదా?

    Heavy_romance1శృంగారంలో ఇక చాలు అనిపించడం లేదా రతిక్రీడలో మహిళకు అనంతమైన ఆనందాన్ని అందించడం ఎలా అనే విషయం పైనే పురుషుడు ఎక్కువ దృష్టి పెడతాడు. అయితే, మహిళలు వారికేం కావాలో అడగరు. కాబట్టి, మగవారే ఒకడుగు ముందుకేసి వారి కేంకావాలో పసికట్టి ఎక్కువ చొరవతీసుకుం టారు. మహిళలకు ఆనందం కలిగించేది అం దించాలి. అంతేగానీ అస్తమానం రతిక్రీడతో విసిగించకూడదు. రతిక్రీడలో రొమాన్స్‌ మహిళకు భావప్రాప్తి కలిగిస్తుంది. రతిక్రీడలో ఆమెకు ఇది ప్రధానాంశం. ఘాటైన ముద్దు లేదా గట్టి కౌగిలి లేదా డర్టీ మాటలు ఆమె రొమాంటిక్‌గా భావిస్తుంది. మహిళ సెషన్‌లో మీరే ముందుకు రావాలని, వచ్చిన తర్వాత అద్భుతంగా ఆడేయాలని భావిస్తుంది. ఒక్కోసారి ఆమే ముందుకు వస్తే... వద్దనవద్దు లేదా అశ్రద్ధ చేయవద్దు. అలా చేస్తే ఆమె మూడ్‌ చెడిపోయినట్లే. మహిళ తన పురుషుడితో ఎంతో సౌకర్యంగావుండాలను కుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త గా అతి నెమ్మదిగా ఆమెను సౌకర్యానికి గురిచేయండి.ఆమె నమ్మకం పొందండి. ఆమె అందాన్ని పొగడటం, ప్రేమిస్తున్నా ననటం వంటివి ఆమెను నమ్మిస్తాయి. త్వరగా భావప్రాప్తిని పొందేలా చేస్తాయి.మహిళకు ఫోర్‌ ప్లే లేకుండా రతి పూర్తయినట్లు కాదు. ఫోర్‌ ప్లే లో కామోద్రేకం బాగా కలుగుతుంది. ఆపైన ఎలా కావాలంటే అలా.. !పురుషుడిలానే ఆమె కూడా భ్రమలకు లోనవుతుంది. ఆమెకుగల ఊహలేమిటో తెలుసుకొని ప్రొసీడ్‌ అవ్వండి. అవి వాస్త వాలైతే ఎంతో ఇష్టపడుతుంది. దీనికిగాను కొద్దిగా మాటల్లోకి దించాలి. క్లైమాక్స్‌ అయిందంటే... మహిళకు గట్టి కౌగిలి చాలా ఇష్టం. నిద్రించే ముందర ఈ కౌగిలి ఇస్తే చాలా ఇష్టపడు తుంది. క్లయిమాక్స్‌ తర్వాత బెడ్‌ పైనుండి వెంటనే లేచారో... మిమ్మల్ని ఒక స్వార్ధపరుడుగా భావిస్తుంది. తనను కోరికలు తీర్చే యంత్రంలా వాడుకుంటాడంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers