
చాలా మంది వివాహాలు వారివారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పెద్దల ఒత్తిడితో జరుగుతుంటాయి. ఇలాంటి జంటలు తమ శృంగార జీవితంలో ఎలాంటి సుఖాన్ని పొందలేక మానసిక ఒత్తిడిలో కుంగికృశించి పోతుంటారు. దీనివల్ల భార్యాభర్తలిద్దరిలోనూ సెక్స్ కోర్కెకలు రోజురోజుకీ తగ్గిపోవడం సహజం. ముఖ్యంగా పురుషుల్లో అంగస్థంభన సమస్య ఉత్పన్నమవుతుంది. మహిళలోనూ సెక్స్ అంటేనే ఒక రకమైన ఏహ్యభావానికి లోనవుతుంటారు. ఇలాంటి సమస్యలపై నిపుణులు స్పందిస్తే...స్త్రీ పురుషులిద్దరిలో శృంగార సమస్యలు ఏర్పడడానికి శారీరక కారణాలు, వ్యాధులు లేనప్పుడు భాగస్వామి ప్రవర్తనే ప్రధాన కారణంగా నిలుస్తుందంటున్నారు. ఒకవేళ సెక్స్ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారంలో భాగస్వామి సహకారం లేకున్నా అవి ఎక్కువవుతాయని చెపుతున్నారు. నిరంతరం ఘర్షణ పడే దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి, అశాంతికి లోనైనపుడు మనసే కేంద్రంగా పనిచేసే సాధారణ శృంగార చక్రం కలిగించే రసాయన, నాడీ, హార్మోన్ స్పందనలు కుంటుపడతాయని చెపుతున్నారు.
దీంతో మగవారిలో అంగస్థంభన లోపం, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు, స్త్రీలలో వెజెనిస్మస్, ఫ్రిజిడిటీ వంటి సమస్యలు కలుగుతాయని చెపుతున్నారు. పురుషులలో ఆధిపత్య ధోరణులు స్త్రీలలో ఆత్మనూన్యత, డిప్రెషన్‌కు దారితీసి వారిలో శృంగారంపై ఆసక్తిని తగ్గించివేస్తాయని చెపుతున్నారు. వరకట్న వేధింపులు, ఇంట్లో అత్త, ఆడబిడ్డల ఆధిపత్యం, చదువు-ఉద్యోగాలు కొనసాగించ లేకపోవడం, పిల్లల పెంపకం వంటివి స్త్రీలలో డిప్రెషన్‌ను కలిగిస్తాయని చెపుతున్నారు.