
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియా ప్రేక్షకులకి పరిచయం అయిన ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తరువాత బాలీవుడ్ హీరోయిన్ గా అవతారం ఎత్తి, జిస్మ్ -2 చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈమె ఆ సినిమాలో నటిస్తుందనగానే....ఈ సినిమా పై అంచానాలు పెరిగాయి. సన్నీలియోన్ ఆ సినిమాలో ఏ మాత్రం సిగ్గులేకుండా బాలీవుడ్ జనాలకి ఏమాత్రం మసాలా కావాలో ఆ మాత్రం చూపించింది. దీంతో సినిమా రసికులు ఆమెకు అభిమానులగా మారి ఆమె గతంలో నటించిన ఫోర్న్ సినిమాలు, హాట్ ఫోటోలు చూసేవారు పెరిగిపోయారు.
అయితే ఇలా ఇంటర్నెట్లో సన్నీ లియోన్ అందాలు చూసేందుకు ఆరాట పడుతున్న వారిని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. సన్నీ లియోన్ ఫోటోలు, వీడియో ద్వారా డేంజర్ కంప్యూటర్ వైరస్ వ్యాపింప చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని, ఆమె ఫోటోలు, వీడియోల కోసం వెతికేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ మెకాఫే సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సన్నీ లియోన్ చాలా ప్రమాద కారిగా ఉందని, ఆమె పేరుతో ఉన్న ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేసుకుంటే మీ కంప్యూటర్ లోకి వైరస్ వ్యాపించే అవకాశాలు అత్యధికంగా 9.95 శాతం ఉందని అంటున్నారు. సో... శ్రుంగార ప్రియులు తస్మాత్ జాగ్రత్త.
