
చిన్న వయస్సులో వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక నటించినవి కొన్ని సినిమాలు అయినా మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు చేసిన చిత్రాలు కొన్ని బాక్సాసీసు వద్ధ బోల్తా కొట్టినా, ఈ అమ్మడుకి అడపా దడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా నటించి, జూనియర్ కుష్బుగా పేరుతెచ్చుకున్న హన్సిక అక్కడ కూడా మంచి అవకాశాలనే రాబట్టుకుంటుంది. ఈమధ్యన మంచు విష్టుతో నటించిన హన్సిక తాజాగా కార్తీ హీరోగా నటించే 'బిర్యానీ' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే, మరో చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపినట్టు సమాచారం. మరి ఎన్నడు రానంతగా ఇప్పుడు కోలీవుడ్ లో అవకాశాలు రావడంతో హన్సిక వారిని మాయ చేసిందని, హన్సికకు ఇలా వరుసగా అవకాశాలు రావడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు కోలీవుడ్ జనాలు.
