
హాట్ బ్యూటీ అనుష్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమెకు సినిమాల్లో ఎంత మంచి పేరు ఉందో బయట కూడా అంతే మంచి పేరు ఉంది. ఈమె తన దగ్గర పనిచేసే వాళ్ళను తన సొంత మనుషుల్లా చూసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇచ్చి త్రుప్తి పరుస్తుంది. అంతే కాకుండా తనను నమ్ముకున్న వారికి కోసం ఏదైనా చేస్తుంది. ఆ మధ్యన తన పర్సనల్ మేకప్ మెన్ కి పంచాక్షరి సినిమా ఫ్రీగా చేసి పెట్టింది. ఇటీవలే కారుడ్రైవర్‌కు 10 లక్షల కారు బహుమతిగా కూడా ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్న మధ్యన తమిళ చిత్రంలో కార్తీ సరసన నటిస్తుంటే.. షూటింగ్ జరుగుతుండగా మేకప్‌మేన్ యూనియన్‌లో అతనికి సభ్యత్వం లేదని ముప్పైమంది కార్మికులు వచ్చి ఆమెను షూటింగ్ చేయకుండా ఆపేశారు. ఈ వివాదం గురించి తెలుసుకున్న హీరో కార్తీ దాన్ని పరిష్కరించాడు. అయితే కోలీవుడ్ జనాలు మాత్రం అనుష్క డ్రైవర్లను, మేకప్ మెన్ లను త్రుప్తి పరచడంలో ముందుంటుందని అనుకుంటున్నారు.