
డైలాగ్ కింగ్ మోహన్ బాబుకి కోపం వచ్చింది. ఈయన కోపానికి సెన్సార్ బోర్డు ధనలక్ష్మి బలైంది. ఆయనకు కోపం వస్తే ఎలా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. ఈయన తాజాగా తన కొడుకు నటించిన ‘దేనికైనా రెడీ ’ సినిమా తమిళ వెర్షన్ విషయంలో ధనలక్ష్మి పై ఫైర్ అయ్యాడు. ‘దేనికైనా రెడీ ’ చిత్రానికి సంబంధించి సెన్సార్ సభ్యురాలైనా ఆమె కొన్ని అభ్యంతరాలు చెప్పింది. ఈ సినిమాని తెలుగు వెర్సన్ రోజే విడుదల చేయాల్సి ఉన్నా ఆమె దానికి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేసింది. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. విడుదలకు రెండురోజుల ముందు కూడా సెన్సార్ విషయంలో ఇబ్బంది పెట్టారు. నా అనుమతి లేకుండా సోమవారం నాడే మలయాళ వెర్షన్ సినిమాను ఆమె సభ్యులకు చూపించారు. నిర్మాత అనుమతి లేకుండా చేయడం దారుణం. అసలు సెన్సార్ సభ్యులు అర్హతలు ఏమిటో అర్థం కావడంలేదు. పెద్ద రికమెండేషన్‌పై వస్తున్నారు. ఇక్కడ అ,ఆలు కూడా తెలీవు. అంటూ తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. దీని పై ధనలక్ష్మి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
