
ఏ ముహుర్తాన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నాగార్జున ‘ఢమరుకం ’ సినిమాని మొదలు పెట్టాడో గానీ ఆ సినిమాకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. షూటింగు మొదలు పెట్టి సంవత్సరం ధాటినా ఆ సినిమా ఇంత వరకు విడుదల కాలేదు. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వల్లే లేటు అవుతుందని మొదటి నుండి చెప్పుకొచ్చారు. మొదటి నుండి ఈ సినిమా పై ఎంతో కేర్ తీసుకున్న నాగార్జున దసరాకి విడుదల చేయాలని పంథంతో కూర్చున్నాడు. కానీ దసరాకి విడుదల చేయలేక పోయారు. కారణం పవన్ సినిమా ప్రభావం ఈ సినిమా కలెక్షన్ల పై పడుతుందని భావించారు. కానీ చిన్న సినిమా అయిన మంచు విష్ణు ‘దేనికైనా రెడీ ’ ని విజయ దశమిరోజు గ్రాండ్ గా విడుదల చేశాడు. కానీ ఢమరుకం మాత్రం విడుదల చేయలేక పోయారు. దీని వెనుక పెద్ద కారణం ఉందటున్నారు ఫిలిం నగర్ జనాలు. చిత్రానికి భారీ బడ్జెట్ కావడంతోపాటు దర్శకుడు తీసిందానికి బయ్యర్లెవరూ ఉత్సాహం చూపకపోవడం మరో కారణమని చెపుతున్నారు. భారీ రేట్లు పెట్టి ఈ చిత్రాన్ని కొనడానికి కొన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్లు రాకపోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు. ఇన్ని సమస్యలతో ఆ సినిమా సతమతం అవడంతో విసెగెత్తిన నాగ్ కూడా ఈ సినిమాని ఎప్పుడైనా విడుదల చేసుకోండి అని ప్రక్కకు తప్పుకొని, వేరే సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయాడని అంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్‌కు కూడా రావడానికి ఇష్టపడటం లేదని ఫిలింనగర్ కథనం.