
నేనెందుకు తగ్గాలి.. 'ఎంతటి హీరో అయినా... ఎంతటి దర్శకుడైనా ఒకటే... పైసా కూడా తగ్గించేది లేదు... అసలు మన దగ్గర అలాంటి పప్పులు ఉడకవు' అంటోంది భారీ సోయగాల సుందరి అనుష్క. ఈ అమ్మడు చెప్పిన ఈ మాటలు విని ఓ తమిళ నిర్మాత షాక్ అయ్యాడట. ఇక విషయంలోకి వెళితే, అజిత్ హీరోగా శివ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో అనుష్క కథానాయిక అయితే బాగుంటుందని చెప్పి, ఆమెను బుక్ చేయమని నిర్మాతలకు చెప్పాడు దర్శకుడు. సదరు నిర్మాతలు అనుష్కను సంప్రదించి, 'అజిత్ సూపర్ స్టార్ కదా... ఈ సినిమా చేస్తే నీకు కూడా ప్లస్ అవుతుంది... కాస్త రేటు తగ్గించుకో తల్లీ' అంటూ వేడుకున్నారట. ఆ మాటలు ఆవిడగారికి కోపాన్ని తెప్పించాయట. 'నేనూ పెద్ద హీరోయిన్ నే. నా పరిధి చాలా పెద్దదే. ఎవరి సినిమా అయినా నాకు ఒకటే... ఎట్టి పరిస్థితులలోనూ పారితోషికం తగ్గించేది లేదు' అంటూ కరాఖండీగా చెప్పేసిందట.
...avnk