పెళ్లవకుండా సహజీవనం చేసే విధానంమీద అందాల భామ కాజల్ స్పందించింది. పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి నివసించటమెందుకని తన మనసులో మాట బయటపెట్టిందీ అమ్మడు విదేశాల్లో లివింగ్ టుగెదర్ చాలా కామన్. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఇది మొదలయ్యింది అయితే ఇక్కడ ఈ పద్దతి అంత వర్కవుట్ కాదంటోంది. ఇటీవల ఓ సందర్భంలో కాజల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ - 'పెళ్లికి ముందు సహజీవనం చాలా తప్పు. ఒక వేళ ఒకరినొకరు ఇష్టపడితే ఎంచక్కగా పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చెయ్యొచ్చు కదా... ఇలా సహజీవం చేయడం ఎందుకు'' అని తేల్చి చెప్పేసింది.
ఈ కతిలాఉంటే... సూపర్ స్టార్ మహేష్ బాబుతో డ్యాన్సులు చేయలేకపోవడం వల్లే తనను సుకుమార్ చిత్రం నుంచి తీసేశారంటూ వస్తున్న వార్తలను అందాల కాజల్ ఖండిస్తోంది. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదనీ, అవన్నీ ఒట్టి వదంతులేననీ ఈ అమ్మడు చెబుతోంది. 'డ్యాన్సుల గురించి ఇప్పుడు నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవలసిన అవసరం లేదు. వచ్చిన చిక్కల్లా కాల్ షీట్లే. అందుకే ఆ సినిమా వదులుకోవలసి వచ్చింది' అంటోంది కాజల్. 'ప్రస్తుతం ఓపక్క 'నాయక్', 'బాద్ షా', 'సార్ వచ్చారు' చిత్రాలతో బిజీగా వున్నాను. మరోపక్క సుకుమార్ సినిమా షెడ్యూలు అనుకున్నట్టుగా జరగలేదు. కేన్సిల్ అయింది. అలాంటప్పుడు ఆ సినిమాకు బల్క్ డేట్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? అందుకే, ఆ ప్రాజక్టు నుంచి తప్పుకున్నాను. జరిగిందిది...అంతే తప్ప నాకు డ్యాన్సులు రాక మాత్రం కాదు' అంటూ వివరించింది కాజల్.
...avnk