
అందచందాలు పుష్కలంగా ఉన్నా, అవకాశాలున్నా.. ‘హాట్’ టాపిక్ గా మారలేకపోతోంది తాప్సి. ‘మిస్టర్ ఫర్ఫెక్ట్ ’ సూపర్ హిట్ కొట్టినా ‘మొగుడు’తో గాలి తీసేసినట్టయిపోయింది. రవితేజతో జతకట్టిన రెండు చిత్రాలూ సోసోగానే ఆడాయి. మొత్తానికి ఎటుచూసినా తాప్సీ కెరీర్ లో ఊపు కనిపించడం లేదు. అందుకే ఇప్పుడీ అమ్మాయి ఆశలన్నీ ‘గుండెల్లో గోదారి’పైనే. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి హిట్ కొట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే... మరోపక్క అగ్రశ్రేణి యువ హీరోలు తాప్సీని పట్టించుకోవడం లేదట. తాప్సీ అనే కథానాయిక ఉందన్న ఉనికినే వారు మర్చిపోయారని కొందరంటున్నారు. పాపం... ఈ సంగతి తాప్సీకి తెలిస్తే... గుండెల్లో గోదారి వరదేమో..
....avnk