
‘ఏ ఉమెన్ ఇన్ బ్రహ్మనిజం’ అనే సినిమాను నిషేధించడానికి రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. చలం రాసిన కథ ఆధారంగా తెరకెక్కింది అని చెప్పబడుతున్న ఈ సినిమా బ్రహ్మణులను, స్ర్ర్తీలను కించపరిచేవిధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. దీంతో హోం మంత్రి ఈ విషయంపై పలువురితో చర్చించి ఈ నిషేధం నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్టంలో ఈ చిత్రాన్ని నిషేధించాలని రాష్ర్ట సమాచార శాఖ కమీషనర్ చంద్రవదన్ శనివారం నాడు హోమ్ శాఖ కార్యదర్శకి లేఖ రాశారు. ఒంగోలుకు చెందిన గోవర్థన్ ఈ సినిమాను నిర్మించి ట్రైలర్ ను యూట్యూబ్ లో పెట్టి, ఆ ట్రైలర్ చూసుకుని తన మొబైల్ నెంబర్లతో మాట్లాడాల్సింగా పత్రికల్లో ప్రకటన ఇవ్వడంతో ఈ సినిమా వెలుగులోకి వచ్చింది. ‘బ్రాహ్మణులు.. పూర్వకాలంలో బ్రాహ్మణేతరులకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే.. బ్రహ్మణేతరులు ఇప్పుడు బ్రహ్మణ స్ర్తీతో సంభోగించాల్సిందే’ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్లు ఆ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ కూడా ఉంది. అసలే బూతు సినిమా, దానికి తోడు కులవివాదం కూడా తోడవ్వడంతో ‘ ఏ ఉమెన్ ఇన్ బ్రహ్మనిజం’ సినిమాను నిషేధించడానికి ప్రభుత్వం పూనుకుంది.
...avnk