
సైఫ్ ఆలీఖాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఎంత స్టార్ ఇమేజ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే. ఇతను ఈ మధ్యనే బాలీవుడ్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ ఇంత ముదురు వయస్సులో రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఆ సంగతి పక్కన పెడితే.... సైఫ్ ఆలీఖాన్ చెల్లెలు సోహా ఆలీ ఖాన్ కూడా బాలీవుడ్ తెర పై తెరంగ్రేటం చేసినా అంతగా రాణించలేక పోయింది. ఇక అన్నకు ఉన్న ఇమేజ్ తోనైనా ఏమైనా అవకాశాలు వస్తాయంటే... కనీసం ఈమె వైపు కన్నెత్తి కూడా ఎవరూ చూడటం లేదు. దీంతో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవాలనుకున్న సోహా ఆలీ ఖాన్ హాట్ హాట్ గా ఫోటో సెషన్స్ చేస్తూ ఉంది. ఈ మధ్యనే ఓ మగాళ్ళ పత్రిక కోసం ఫోటో సెషన్స్ లో పాల్గొన్న సోహా హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. ఇక ఈమె మరో బాలీవుడ్ నటుడు అయిన కునాల్ ఖేముతో లవ్వాయనం నడుపుతున్నట్లు వార్తలు. త్వరలో వీరిద్దరు కూడా ఒక్కటి కాబోవడం ఖాయం అంటున్నారు. మరి ఘాటు హాట్ ఫోటోలు ఎమైనా అవకాశాలు తెచ్చి పెడతాయో లేదో చూడాలి.